అలసట, చికాకు పోవాలంటే ఇవి తినండి

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 07:42 PM

అలసట, చికాకు వంటి ఇబ్బందులు మన రోజును ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనసును ఉత్తేజ పరిచేందుకు తోడ్పడతాయి.

1. ఉదయం అల్పాహారం తీసుకోనప్పుడు ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఎక్కువ మాంసకృత్తులుండే ఆహార పదార్థాలను పొద్దున్నే తింటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. బాదం, పాలు, అరటిపండ్లు సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోను విడుదలకు తోడ్పడతాయి. వీటిని పొద్దున్నే తింటే మంచిది.

2. బాదం, పిస్తా, అవిసె గింజలు, చేపల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే రోజువారీ పనులకు అవసరమయ్యే శక్తిని పొందొచ్చు.

3. ఉదయాన్నే మొలకలు తింటే జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు తోడ్పడే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

4. మామిడిలో ఉండే మెగ్నీషియంకు ఒత్తిడిని నియంత్రించే గుణం ఉంటుంది. దీంట్లో ఉండే క్యాల్షియం, బి విటమిన్లు శరీరానికి శక్తినిస్తాయి.రాత్రి వేళల్లో నిద్ర పట్టేందుకూ ఇవి ఉపయోగపడతాయి.

5. ఇడ్లీ, దోశెలు, ఊతప్పం, మజ్జిగ వంటి పులిసిన పదార్థాలు తీసుకుంటే తొందరగా జీర్ణమవుతాయి. అలసట, ఒత్తిడితో బాధపడేవారు నూనె పదార్థాలకు బదులుగా వీటిని ఎంచుకోవడం మంచిది.





Untitled Document
Advertisements