వెబ్ సీరీస్ లో సమంత

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 07:55 PM

సౌత్ లో క్రేజీ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత మరింత ఫాం లోకి వచ్చింది. అక్కినేని కోడలిగా మజిలీ, ఓ బేబీ సినిమాలు హిట్లతో మస్త్ జబర్దస్త్ జోష్ లో ఉన్న సమంత ఇప్పుడు కొత్తగా వెబ్ సీరీస్ లో కూడా నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఓ వెబ్ సీరీస్ లో సమంత నటిస్తుందట. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతుందట. సమంతతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ స్టార్స్ అందులో నటిస్తారని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ సీరీస్ కు డైరక్టర్ ఎవరు.. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. వెబ్ సీరీస్ లో సమంత నటిస్తుందని తెలియగానే ఆమె ఫ్యాన్స్ తో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారు.





Untitled Document
Advertisements