కొనసాగుతున్న భారీ ఇన్‌ఫ్లో

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 09:23 AM

కృష్ణమ్మకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి జలాశయానికి వరద స్వల్పంగా తగ్గింది. ఆల్మట్టికి 4 లక్షల 79 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 5 లక్షల 20 వేల క్యూసెక్కల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 5 లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో.. దాదాపు అంతే ప్రవాహాన్ని ఔట్ ఫ్లో గా వదులుతున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 6 లక్షల 80 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం 53 గేట్లను ఎత్తి 6 లక్షల 84 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి 7 లక్షల 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో పది గేట్ల ద్వారా దాదాపు 8 లక్షల 19 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 197 టీఎంసీలు దాటింది. అటు కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

ఇక నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి 7లక్షల 11 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 26 క్రస్ట్ గేట్లు ఎత్తి అంతే ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 300 టీఎంసీలకు చేరింది.పులిచింతల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ నుంచి వస్తున్న నీటితో…. పులిచింతల ఇన్ ఫ్లో 7.52 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 38 టీఎంసీలకు చేరింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. కృష్ణాపరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సాగుకు నీటి కష్టాలు ఉండవని చెబుతున్నారు.





Untitled Document
Advertisements