‘సాహో ది గేమ్‌’

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 11:07 AM

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి వారికి శుభవార్త. ‘సాహో ది గేమ్’ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ గేమ్‌ యాప్‌ను పిక్సలాట్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

‘సాహో’ మూవీ ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది.





Untitled Document
Advertisements