నోట్లు రద్దు సమయంలో అక్రమ లావాదేవీలు...కేంద్రం ప్రత్యేక దృష్టి

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:11 PM

నోట్లు రద్దు సమయంలో అక్రమ లావాదేవీలు...కేంద్రం ప్రత్యేక దృష్టి

నోట్లు రద్దు చేసిన సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై తాజాగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ 17 పాయింట్ల చెక్‌లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సిబిడిటి) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు.





Untitled Document
Advertisements