ప్లాస్టిక్ కు బలైన బేబీ డ్యూగాంగ్

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:16 PM

ప్లాస్టిక్ కు బలైన బేబీ డ్యూగాంగ్

బేబీ డ్యూగాంగ్ జలచర క్షీరదం మరియం ప్లాస్టిక్ కాలుష్యానికి బలైంది. థాయ్‌లాండ్ వన్యప్రాణి సంరక్షణకు సంకేతంగా గుర్తింపబడిన ఈ ప్రాణి శనివారం చనిపోయింది. డ్యూగాంగ్ కడుపులో ప్లాస్టిక్ నలుసులు పేరుకుపోయి ఉండడంతో వ్యాధుల పాలై చనిపోయందని శాస్త్రవేత్తలు చెప్పారు. డ్యూగాంగ్‌ను రక్షించడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని మరియం సంరక్షకురాలు నంటారికా చాన్స్‌యు చెప్పారు. ఫేస్‌బుక్‌లో డ్యూగాంగ్ కలేబరం దృశ్యాన్ని మెరైన్, కోస్టల్ రీసోర్సెస్ విభాగం పోస్టు చేశారు. కడుపులో మంట, గ్యాస్ వల్లనే చనిపోయిందని చెబుతున్నారు. కొన్ని ఎలల క్రితం సముద్ర జలాల్లో దెబ్బతిని తన తోటి డ్యుగాంగ్ మందను వీడి ఒంటరిగా ఈదులాడుతున్న బేబీ డ్యూగాంగ్‌ను థాయ్‌లాండ్ నేషనల్ పార్క్, వైల్డు లైఫ్ , ప్లాంట్ కన్సర్వేషన్ విభాగం ఆదుకుని సంరక్షించింది.





Untitled Document
Advertisements