పూరి.. విజయ్.. జాన్వీ .. సూపర్ కాంబో

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:39 PM

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన బాలీవుడ్ సినిమా దఢక్ సినిమా సూపర్ హిట్టైంది. ఈ సినిమా హిట్ తరువాత, కరణ్ జోహార్ నిర్మాణంలో మరో రెండు సినిమాలు చేయబోతున్నది. అయితే, శ్రీదేవికి ఒక కల ఉండేది. జాన్వీ కపూర్ ను సౌత్ పరిచయం చేయాలని ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి జాన్వీని పరిచయం చేయాలని అనుకుంది.

ఆమె కల నెరవేరకుండానే శ్రీదేవి మరణించింది. అయితే, శ్రీదేవి కల ఇప్పుడు నెరవేరబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతున్నది. ఛార్మి నిర్మాత. ఇందులో హీరోయిన్ గా జాన్వీని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. జాన్వీ కోసం పూరి ట్రై చేస్తున్నారు. ఎలాగో జాన్వీ కూడా విజయ్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్న సంగతి తెలిసిందే. పూరి.. విజయ్.. జాన్వీ.. ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉన్నది కదా.





Untitled Document
Advertisements