పాకిస్థాన్‌కు ఆర్థిక సాయంలో అమెరికా కోత

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:46 PM

పాకిస్థాన్‌కు ఆర్థిక సాయంలో అమెరికా కోత

అగ్ర రాజ్యం అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక సాయంలో 440 మిలియన్ డాలర్ల మేరకు కోత విధించింది. దీంతో 4.1 బిలియన్ డాలర్ల వరకే సాయం పరిమితం చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు మూడు వారాల ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారికంగా ఇస్లామాబాద్‌కు తెలియచేయడమైంది. 2010లో పాకిస్థాన్ ఎన్‌హేన్స్‌డ్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (పిఇఆర్‌ఎ) కింద పాక్‌కు ఆర్థిక సాయం అందించడానికి ఒప్పందం కుదిరింది. ఈమేరకు ఐదేళ్లలో 7.5 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందించ వలసి ఉంటుంది. దీని తరువాత పాక్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమైంది. దాందో వాస్తవంగా ఇవ్వాలనుకున్న సాయం ఇవ్వడానికి వెనుకంజ వేయడమైంది. కెర్రీలూగర్ బెర్మన్ (కెఎల్‌బి) చట్టం కింద ఈ సాయం అందచేయాలనుకున్నా తరువాత పరిస్థితి మారడంతో 4.5 బిలియన్ డాలర్ల నుంచి 4.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. పాక్‌లో ఆర్థికంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్నదే కెఎల్‌బి లక్షం. ఈమేరకు ఆర్థిక వనరులను కల్పించాలనుకున్నారు. ముఖ్యంగా విద్యుత్, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నారు.





Untitled Document
Advertisements