వాట్సాప్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 01:11 PM

వాట్సాప్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా…లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.





Untitled Document
Advertisements