బన్ని సినిమాకు మాత్రం నో

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:00 PM

మెగా హీరోలు రాం చరణ్, అల్లు అర్జున్ తమ సినిమాలతో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ఏర్పరచుకున్నారు. అయితే రాం చరణ్ ఏదైనా సినిమా చేస్తే దాన్ని మించి మరో సినిమా చేయాలని అనుకుంటాడు అల్లు అర్జున్. అయితే మెగాస్టార్ వారసుడు కాబట్టి రాం చరణ్ తర్వాతే అల్లు అర్జున్. బన్ని కూడా ఓన్ టాలెంట్ తో సినిమా సినిమాకు కష్టపడుతూ స్టైలిష్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

రాం చరణ్, బన్నిల మధ్య పోటీ ఉన్నా ఎవరి సత్తా వారు అన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. బన్ని త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. మధ్యలో సుకుమార్ సినిమా కూడా ఉందనుకోండి. సుక్కు సినిమాతో పాటుగా వేణు శ్రీరాం ఐకాన్ మూవీ పార్లర్ గా షూటింగ్ చేస్తారట.

ఐకాన్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్ నటిస్తుంది. అయితే చరణ్ కు ఎస్ చెప్పిన అలియా భట్ బన్ని సినిమాకు మాత్రం నో చెప్పిందట. ప్రస్తుతం షెడ్యూల్ ఫుల్ టైట్ గా ఉండటం వల్ల బన్ని సినిమా చేయలేనని చెప్పిందట అలియా భట్. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మొదటిసారి సౌత్ సినిమా అందులో తెలుగు సినిమా చేస్తున్న అలియా భట్ ఆ సినిమా హిట్టైతే తెలుగు, తమిళ భాషల నుండి భారీ ఆఫర్లు అందుకోవడం ఖాయం.





Untitled Document
Advertisements