సచిన్ రికార్డులు బద్దలు కొట్టేయడం ఖాయం!

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:03 PM

సచిన్ రికార్డులు బద్దలు కొట్టేయడం ఖాయం!

టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టేలా కనిపిస్తోందన్నారు. ఓవైపు యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో స్మిత్‌ వరుస సెంచరీలు బాదుతుండడంతో.. విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌స్మిత్‌లో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్‌? అనే చర్చ జరుగుతోంది. ఐసీసీ ఈ మధ్యే విడుదల చేసి టెస్టు ర్యాంకుల జాబితాలో కోహ్లీ టాప్‌స్పాట్‌లో ఉన్నాడు. స్మిత్‌ థర్డ్ ప్లేస్‌లో ఉన్నా.. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం 9 పాయింట్ల దూరమే. ఈ నేపథ్యంలో కోహ్లీకి స్మిత్‌ సరిజోడని, అతడిని మించిన ఆటగాడని కొందరు ప్రశంసలు కురిపించారు. అయితే, దీనిపై స్పందించిన సెహ్వాగ్.. టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీయే అత్యుత్తమం, స్మిత్‌ కన్నా కోహ్లీయే బెటర్ ప్లేయర్.. బ్యాటింగ్ శైలిలోనూ విరాట్ ఆట చూడముచ్చటగా ఉంటుంది. ప్రపంచంలో అతడే నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌. సచిన్ రికార్డులు బద్దలు కొట్టేయడం ఖామనిపిస్తోంది.సెంచరీలు చేయడంలో కోహ్లీయే బెస్ట్‌. అయితే సచిన్‌ సాధించిన ఒక రికార్డును మాత్రం ఎవరూ దాటకపోవచ్చు. సచిన్‌లా 200 టెస్టులు మరొకరు ఆడతారని అనుకోనని చెప్పుకొచ్చారు వీరు.





Untitled Document
Advertisements