ఉద్యోగులకు తీపికబురు...

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:48 PM

ఉద్యోగులకు తీపికబురు...

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ తీసుకుంటున్న వారికి తీపికబురందింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) మార్పులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అంగీకారం తెలిపింది. 15 ఏళ్ల తర్వాత కమ్యూటెడ్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ (సీవీపీ) పునరుద్ధరణ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ‘కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే.. పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తం పెన్షన్ రూపంలో అందజేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తోందనుకుంటే.. కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు రూ.29,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రతిపాదనకు ఆమోదం వల్ల పెన్షన్‌ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు. 2019 ఆగస్ట్ 21న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 6.3 లక్షల మంది పెన్షర్లకు ప్రయోజనం కలుగనుంది. పెన్షనర్లు దీని కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరిందని చెప్పుకోవచ్చు. సీబీటీ చైర్మన్, కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ సమావేశంలో మాట్లాడుతూ.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఆన్‌లైన్‌లోనే 91 శాతానికి పైగా ఈపీఎఫ్ క్లెయిమ్స్‌ను సెటిల్ చేస్తోందని తెలిపారు. మరణించిన సభ్యుల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌‌ను వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈపీఎఫ్ కాల్ సెంటర్ సేవలను కొనియాడారు. సీబీటీ చైర్మన్ ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ 2.0ను కూడా లాంచ్ చేశారు. ఈపీఎఫ్‌ ఐ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. దీంతో 5 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలుగనుంది. అలాగే లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీంతో సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తవుతుంది. బోర్డు అలాగే ప్రైవేట్ రంగ కంపెనీల బాండ్స్‌లో తదుపరి ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆమోదం తెలిపింది. పీఎస్‌యూ బాండ్లలో పెట్టుబడులకు క్రిసిల్, కేర్, ఇక్రా, ఇండియా రేటింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటుంది. నిఫ్టీ 50, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఫండ్ కేటాయింపులకు కూడా బోర్డు ఓకే చెప్పింది. రెండింటిలోనూ సగం సగం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే డీహెచ్ఎఫ్‌ఎల్ బాండ్ల ముందుస్తు రిడింష్షన్‌కు అంగీకారం తెలిపింది. రూ.2,300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్న జీఎస్‌పీసీ ఎన్‌సీడీ బాండ్లను జీఎస్ఐఎల్‌కు మార్చడానికి ఆమోదం తెలిపింది.





Untitled Document
Advertisements