అరటి పండు గుజ్జులో బీరు...తలకు పట్టిస్తే?

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:54 PM

అరటి పండు గుజ్జులో బీరు...తలకు పట్టిస్తే?

బీరును తాగడమే తప్ప దానితో మరే ఉపయోగం లేదు అని అనేక మంది అనుకుంటారు. కాని బీరుతో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అరటి పండు గుజ్జులో బీరు కలిపి తలకు పట్టిస్తే ఏమవుతుందో తెలిస్తే మీరు కూ ట్రై చేయక మానరు. ఎందుకంటే జుట్టు రాలే సమస్యకు ఈ ట్రిక్ ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే? ముందుగా ఒక అరటి పండు, ఓ అరకప్పు బీరు, ఒక గుడ్డు సొన, 1-2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోండి. వీటిని కలిపి బాగా మెత్తగా అయ్యేలా చేయండి. తర్వాత దాన్ని మీ తలకు పట్టించండి. అలా ఓ రెండు గంటలు వదిలేసి తర్వాత కడిగేసుకోండి. కాస్త మంటగా అనిపించినా ఫర్వాలేదు. ఇలా వారానికి ఓసారి చొప్పున ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పెరగడాన్ని కచ్చితంగా గమనిస్తారు. జుట్టు రాలిపోవడం తగ్గడమే కాదు, రాలిన మీ జుట్టు తిరిగి వస్తుంది కూడా. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్ లా పెట్టుకోవడం వల్ల జుట్టు డ్యామేజీని అరికడుతుంది. ఇది మీ జుట్టుకు సహజమైన కండీషనర్ గా ఉపయోగపడుతుంది. తలలో అధికంగా ఉండే నూనెలను తగ్గించడానికి కూడా ఈ మాస్క్ తోడ్పడుతుంది. దీంతో మీ జుట్టు సాఫ్ట్ గా మారుతుంది. కొడి గుడ్డు సొన జుట్టు పోషణకు ఉపయోగపడుతుందనేది తెలిసిందే. అలాగే తేనె, బీరులలోనూ జుట్టు పెరిగేందుకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి.





Untitled Document
Advertisements