26వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 07:34 PM

అరెస్టు నుంచి తప్పించుకోవాలని అజ్ఞాతంలోకి వెళ్లినా.. ఆ తర్వాత గోడ దూకి మరీ చిదంబరాన్ని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. రాత్రి అంతా సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉన్న ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల పాటు ప్రశ్నించినా సీబీఐ అధికారులకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపింది సీబీఐ. మరోవైపు సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు చిదంబరం చెప్పుకొచ్చారు. అయినా, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మరింత లోతైన విచారణ కోసం చిదంబరాన్ని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వాదించింది సీబీఐ. దీంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చిదంబరాన్ని ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు చిదంబరం. ఇక, చిదంబరం తరపున కోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబల్. మరోవైపు చిదంబరం బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ కస్టడీకి అనుమతించింది. ప్రతీరోజూ అరగంటపాటు కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించింది. అరెస్ట్ నుంచి తప్పించుకుందామన్న తప్పలేదు.. చివరకు కస్టడీ నుంచి తప్పుంచుకోవాలని చూసినా కుదరలేదు.





Untitled Document
Advertisements