సొంత పార్టీ నేతలే జగన్‌కు తల నొప్పిగా మారే అవకాశాలు ?

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 07:54 PM

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ పాలనపై ప్రశంసలు ఎలా ఉన్నా విమర్శలు కూడా బాగానే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపె జగన్ నిర్ణయాలను తప్పుపడుతూ ప్రజలలో జగన్ పాలనపై కాస్త వ్యతిరేకతను తీసుకువస్తుందనే చెప్పాలి. అయితే వైసీపీ అధికారాన్ని చేపట్టి కనీసం 100 రోజులు కూడా కాలేదు కాబట్టి ప్రజలు కూడా కాస్త సమయం ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా విమర్శలు రావడం అనేది సర్వసాధారణం. అయితే జగన్‌పై ఒక విషయంపై మాత్రం సొంత పార్టీ నేతలే కాస్త గుర్రుగా ఉన్నారట. ఎన్నికల సమయంలో వైసీపీలోని చాలా మంది నేతలు సీట్ల కోసం పోటీపడినా అందరికి అవకాశం లభించలేదు. అయితే జగన్ చెప్పడంతో దాదాపు 25 మంది నేతలు తమ సీట్లను త్యాగం చేసి సీటు లభించిన నేతల కోసం కష్టపడి పనిచేసారు.

అయితే సీట్లు త్యాగం చేసిన వారందరికి పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని జగన్ వారందరికి హామీ ఇచ్చారు. అయితే జగన్ మాత్రం వారందరిని మరిచిపోయి ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడం, వారికి పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వడం చూసిన ఈ నేతలు ఇప్పుడు జగన్‌పై లోలోపల విమర్శలు చేస్తున్నారట. మాకు మాట ఇచ్చి జగన్ నిలబెట్టుకోలేదని పార్టీ గెలుపు కోసం, జగన్ కోసం కష్టపడి పనిచేస్తే కనీసం తమకు నామినేటెడ్ పదవులు కూడా దక్కడంలేదని వాపోతున్నారట. అయితే జగన్ పాలనపైనే కాకుండా కాస్త వీరిపైన కూడా దృష్టి సారించి వీరికి న్యాయం చేస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని లేదంటే భవిష్యత్తులో సొంత పార్టీ నేతలే జగన్‌కు తల నొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారట. అయితే జగన్ ఇప్పటికైనా తేరుకుని అసంతృప్తి నాయకులను ఓదారుస్తాడా లేక ఏవైనా పదవులు కట్టబెడుతాడా అనేది చూడాలి మరీ.





Untitled Document
Advertisements