జియోకి పోటీగా టాటా స్కై నయా ఆఫర్

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 07:56 PM

జియోకి పోటీగా టాటా స్కై నయా ఆఫర్

రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా డీటీహెచ్ ఆపరేటర్ టాటా స్కై సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. టాటా స్కై హెచ్‌డీ సెట్-టాప్-బాక్స్‌తో పాటు టాటాస్కై బింజ్ బండిల్ కలిపి రూ.4,999 ధరకే అందించనుందన్నట్టు వార్తలొస్తున్నాయి. రూ.4,999 చెల్లించిన వారికి రూ.1,499 విలువైన హెచ్‌డీ సెట్-టాప్-బాక్స్‌ ఉచితంగా లభిస్తుంది. అలాగే రూ.2,499 అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. దాంతోపాటు రూ.1,494 విలువైన ఆరు నెలల ఉచితంగా లభిస్తుంది. దీంట్లోనే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంటుంది. రూ.4,999 చెల్లించి టాటా స్కై సెట్-టాప్-బాక్స్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకున్నవాళ్లు ఛానెల్ ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఛార్జీలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎంచుకున్న ఛానెళ్లకు రూ.250 ఛార్జీలు అయ్యాయనుకుంటే మీ బ్యాలెన్స్‌లో ఉన్న రూ.2,499 నుంచి ప్రతీ నెలా డిడక్ట్ అవుతుంది. ఇక టాటా స్కై బింజ్ సర్వీస్‌లో 3 నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దాంతో పాటు హాట్‌స్టార్, ఎరాస్ నౌ, సన్‌ నెక్స్ట్‌, హంగామా ప్లే కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. ఆల్ట్ బాలాజీ, జీ5, నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ చూడాలంటే డబ్బులు చెల్లించాలి. ఆరు నెలల తర్వాత టాటా స్కై బింజ్ ఫ్రీ సర్వీస్ పూర్తవుతుంది. ఆ తర్వాత నెలకు రూ.249 చెల్లించాలి.





Untitled Document
Advertisements