‘జర్ర జర్ర’ ఐటమ్ సాంగ్‌

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 07:56 PM

హైదారబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రంలో వరుణ్ తొలిసారి గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.



ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘జర్ర జర్ర’ అనే ఐటమ్ సాంగ్‌ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఊర మాస్ గా రూపొందించిన ఈ సాంగ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements