గూగుల్‌పై మండిపడుతున్న ట్రంప్

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 04:50 PM

గూగుల్‌పై మండిపడుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గూగుల్‌పై నిప్పులు చెరుగుతున్నాడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్‌ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా సెర్చింజన్‌ ఫలితాలను తారుమారు చేశారని ఆయన ట్విటర్‌లో ఆరోపించారు. గూగుల్‌ దాదాపు 1.6 కోట్ల మంది ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని.. హిల్లరీదే విజయమన్నట్లు సెర్చింజన్‌ ఫిలితాల్లో పేర్కొందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత ఏడాది గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పార్లమెంటరీ కమిటీ ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గూగుల్‌ ఉద్దేశపూర్వకంగా సెర్చింజన్‌ ఫలితాలను తారుమారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దానిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements