గాంధీ ఫోటోతో ఉన్న బీర్లపై నిషేధం

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 04:59 PM

గాంధీ ఫోటోతో ఉన్న బీర్లపై నిషేధం

చెక్ రిపబ్లిక్ దేశంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్న బీర్లపై నిషేధం విధించాయి. ఇకపై గాంధీ ఫోటో ఉన్న బీర్లను తయారు చేయమని పివోవర్ చ్రిక్ కంపెనీ యాజమాన్యం తెలిపింది. అక్కడ ఉన్న ఇండియా పాలే ఆల్ బీర్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు మూడు రంగుల జెండాను ఉంచడంతో మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈబీ జె జోష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశాడు. భారత మూడు రంగుల జెండాను ఉపయోగించడంతో పాటు జాతిపిత మహాత్మ గాంధీ ఫోటోను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చెక్ రిపబ్లిక్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అగష్టు 31 వరకు తమ బీర్లపై మహాత్మ గాంధీ ఫోటోతో పాటు మూడు రంగులను తొలగిస్తామని పివోవర్ కంపెనీ స్పష్టం చేసింది. గతంలో ఇజ్రాయిల్ దేశంలో ఓ కంపెనీ తమ బీర్ సీసాపై మహాత్మ గాంధీ ఫోటోను తొలగించి భారత దేశానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements