విక్రమ్‌ రాథోడ్‌ బ్యాటింగ్‌ కోచ్‌?

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 05:02 PM

విక్రమ్‌ రాథోడ్‌ బ్యాటింగ్‌ కోచ్‌?

భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆయా కోచ్‌ పదవులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్ బంగర్‌ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బిసిసిఐ సిఇఓ రాహుల్‌ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్‌, మూడో స్థానంలో ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ రామ్‌ప్రకాశ్‌ నిలిచారని తెలిపారు. మరోవైపు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ తమ స్థానాలను పదిలం చేసుకున్నట్లు తెలిసింది. టీమిండియాకు నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని తీర్చిదిద్దడంలో బంగర్‌ విఫలమయ్యాడని, అదే అతడి పదవికి ఎసరు పెట్టినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Untitled Document
Advertisements