రాయుడు రీ ఎంట్రీ...నిజమేనా?

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 08:05 PM

రాయుడు రీ ఎంట్రీ...నిజమేనా?

ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి తెరలేపనున్నాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని.. మళ్లీ బ్యాట్ పట్టాలని తహతహలాడుతున్నాడట ఈ హైదరాబాదీ క్రికెటర్. ప్రస్తుతం టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టు తరపున ఆడుతోన్న రాయుడు... ఈ సందర్భంగా టీమిండియా తరుఫున టీ-20 మ్యాచ్‌ల్లో ఆడాలని భావిస్తున్నట్టు తన మనసులోని మాట బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టాలన్న ఆలోచన తనకు ఉందని రాయుడు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంతో ఆవేదనకు గురై రిలైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననడం చర్చనీయాశంగా మారింది.

Untitled Document
Advertisements