ప్యాంటు ఉంది కాబట్టి సరిపోయింది..లేకపోతే?

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 08:58 PM

ప్యాంటు ఉంది కాబట్టి సరిపోయింది..లేకపోతే?

స్నేహితులతో కలిసి పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తున్న యువకుడికి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. అతడి పిరుదుల భాగాన్ని జూమ్మంటూ తేనెటీగలు ఆక్రమించాయి. ఆ విషయం తెలియక ఆ యువకుడు చాలా దూరం నడిచాడు. తేనెటీగల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా.. అని అతడి స్నేహితులు వెనక్కి వెళ్లి చూశారు. అతడి ఫ్యాంట్‌ వెనుక తేనెతుట్టను చూసి ఆశ్చర్యపోయారు. నాగాలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోను ఆ రాష్ట్ర మంత్రి కిరెన్ రిజీజు ట్వీట్ చేశారు. దీంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. మెట్లు ఎక్కుతున్న ఓ యువకుడి ఫ్యాంటు వెనుక తేనెతుట్టను చూసి ఫ్రెండ్స్ గొల్లున నవ్వడం, ఆ యువకుడు సిగ్గుతో తల పక్కు తిప్పుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ‘‘తేనెటీగలు నిజంగానే పెట్టకూడని చోట గూడు పెట్టాయి. ఇలాంటివి కేవలం నాగాలాండ్‌లో మాత్రమే జరుగుతాయి’’ అని కిరెన్ రిజీజు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వీడియోను నాగాలాండ్ ఎమ్మెల్యే మహోన్లుమో కికాన్ పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో చేతులు మారుతూ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ ఫన్నీ వీడియో ట్వీట్‌ను మీరూ చూసేయండి.

Untitled Document
Advertisements