లవర్స్ ఇకపై టాయిలెట్స్ ను వాడకోకుండా ఉంటే మంచిది!

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 09:48 PM

లవర్స్ ఇకపై టాయిలెట్స్ ను వాడకోకుండా ఉంటే మంచిది!

ప్రేమికుల ఏకాంతానికి మొదటి చాయిస్ టాయిలెట్స్. చడీ చప్పుడు కాకుండా టాయిలెట్లలోకి ప్రవేశించి కామ క్రీడల్లో మునిగితేలుతున్నారు. అయితే, అక్కడ మాత్రం ఇకపై అలాంటి ఆటలు సాగవు. ఎందుకంటే.. అక్కడ సెక్స్, నేరాలను అడ్డుకొనే సరికొత్త టాయిలెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవెలా పనిచేస్తాయో చూడండి. వేల్స్‌లోని పోర్త్‌కావ్ల్ పట్టణంలోని టాయిలెట్లు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. దీంతో స్థానిక టౌన్ కౌన్సిల్ సరికొత్త టెక్నాలజీతో టాయిలెట్లను రూపొందించాలని నిర్ణయించింది. ఈ టాయిలెట్లలోకి ఒకరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. రెండో వ్యక్తి ప్రవేశించినట్లయితే.. అందులోని వెయిట్ సెన్సార్లు వెంటనే పసిగట్టి జెట్ వాటర్‌తో దాడి చేస్తాయి. అదే సమయంలో అలారం మోగి, టాయిలెట్ తలుపులు వాటికవే తెరుచుకుని బయటకు వెళ్లగొడతాయి. ఈ టెక్నాలజీ వల్ల కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇతరాత్ర నేరాలను కూడా అదుపు చేయవచ్చని కౌన్సిల్ చెబుతుంది. ఎవరైనా టాయిలెట్లలో వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తే.. వెంటనే సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ టాయిలెట్‌లో లైట్లు ఆరిపోతాయి. నీటి సరఫరా ఆగిపోతుంది. అక్కడి పరిస్థితి చక్కబడేవరకు అది రెండోసారి ప్రవేశానికి అనుమతి ఇవ్వదు. ఈ టాయిలెట్ల ఏర్పాటుకు 170,000 పౌండ్లు (రూ.1,47,30,925) ఖర్చవుతుందని అంచనా వేశారు.





Untitled Document
Advertisements