మొటిమలు వస్తే అదృష్టం అంట!

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 09:51 PM

మొటిమలు వస్తే అదృష్టం అంట!

మొటిమలు రావడం సాధారనం. అది తెలిసికూడా అందరూ బెంగపడుతూ ఉంటారు. కొంత మందికి అవి తగ్గినట్లే తగ్గినా మళ్లీ అదే సమస్య ఏర్పడుతుంది. దీనికి వారెన్ని రకాల క్రీములు పూసినా, పళ్లు తోముకోవాల్సిన పేస్టును మొఖానికి రుద్దినా, సబ్బులు, పౌడర్లు ఎన్ని మార్చినా ఏం లాభముండదు. వాటర్ ప్రాబ్లెమ్ అనో, తినే ఫుడ్ ప్రాబ్లెమ్ అనో ఏదో ఒకటి చెప్పుకుని మెల్లగా ఎలాగో అలా బతికేస్తారు. అయితే నిజానికి మొటిమలు రావటం ఒక అదృష్టమని చెప్తున్నారు బ్రిటన్ పరిశోధకులు. లండన్ లోని కింగ్స్ కాలేజీలోని జెనెటిక్ ఎపిడమాలజీ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ మొటిమలు, మొఖంపై పరిశోధన చేశారు. మొటిమలు జెనిటిక్ డిసార్డర్ వల్ల కూడావస్తాయని వారు వెల్లడించారు. అలాంటి వారికి మిగతా వారితో పోల్చుకుంటే ఏజింగ్ ప్రాబ్లెమ్ ఉండదట. వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజమే. అయితే మొటిమలు వచ్చే వారికి చర్మం తొందరగా ముడతలు పడటం ఆలస్యంగా జరుగుతోందని ఈ పరిశోధక బృందం హెడ్ డా. సిమన్ రిబరో పేర్కొన్నారు. వీరి పరిశోధనకు సంబంధించిన విషయాలు 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ' లో పబ్లిష్ అయ్యాయి.

Untitled Document
Advertisements