అక్కడ బుల్లెట్ తగిలింది...అంగస్తంభన సగభాగం మాత్రమే!

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 10:15 PM

అక్కడ బుల్లెట్ తగిలింది...అంగస్తంభన సగభాగం మాత్రమే!

ఓ వ్యక్తి గన్‌ను జేబులో పెట్టుకొనేందుకు ప్రయత్నించగా పెను ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో అది మిస్‌ఫైర్ కావడంతో బుల్లెట్ నేరుగా అతడి పురుషాంగం శీర్షాన్ని తాకుతూ తొడలోకి దూసుకెళ్లింది. అప్పటికైతే గండం తప్పింది. కానీ, ఊహించని విధంగా అతడు కొత్త సమస్యలో చిక్కుకున్నాడు. అంగంలో సగ భాగం మాత్రమే స్తంభించడంతో బిత్తరపోయాడు. యూరాలజీ కేస్ రిపోర్ట్‌ వెల్లడించిన ఈ అరుదైన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బుల్లెట్ నేరుగా అంగాన్ని తాకపోవడం వల్ల అతడు ప్రాణగండం నుంచైతే తప్పించుకున్నాడు. కానీ, సుఖ జీవితానికి ఏదైతే ముఖ్యమో దాన్నే కోల్పోవల్సి వచ్చింది. చిత్రం ఏమిటంటే.. ఈ ప్రమాదం తర్వాత అతడి అంగమైతే స్తంభిస్తోంది. కానీ, తన పురుషాంగంలో ఒక వైపు మాత్రం గట్టి పడుతోంది. ఎడమ వైపు మాత్రం మెత్తగానే ఉండిపోతోంది. బర్మింగ్హామ్‌కు చెందిన యూరాలజీస్ట్ కన్సాల్టెంట్ డాక్టర్ వినెయ్ స్పందిస్తూ.. ‘‘ఆ బుల్లెట్ అతడి శిష్నం (పురుషాంగం పైన రెండుగా చీలి ఉండే అతి సున్నితమైన భాగం)లో ఒక భాగాన్ని బుల్లెట్ తాకింది. దానివల్ల స్పాంజ్‌లా ఉండే శిష్నంలోని ఒక భాగం దెబ్బతిని, రక్తస్రావమైంది. ఫలితంగా అతడి అంగంలో శీష్నానికి ఒకవైపు మాత్రమే గట్టిపడుతోంది’’ అని తెలిపారు. వైద్యులు అతడిని ఆరు వారాలపాటు ఆసుపత్రిలోనే ఉంచి సర్జరీలు చేశారు. చివరికి అతడి సమస్యను పరిష్కరించారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంగం నుంచి రక్తస్రావం జరిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.

Untitled Document
Advertisements