కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా?

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 09:33 PM

కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారా?

త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరులు టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని అనేక వార్తలొస్తున్నాయి. వీరు తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ వారు మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే వీరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఎఐసిసికి ఫిర్యాదు చేసినప్పటికీ, వారిపై అధిష్ఠానం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా మునుగోడు ఎంఎల్ఎగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మంత్రి హరీశ్ రావుతో భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో వీరు అరగంట పాటు భేటీ అయి తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులపై చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్ లో చేరుతున్నారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయంపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.





Untitled Document
Advertisements