మోహనమంత్ర మొదలవబోతోంది.....!!!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 10:18 AM

మోహనమంత్ర మొదలవబోతోంది.....!!!!

తిరుపతి: తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలు ప్రతి ఏటా ఆడంబరంగా నిర్వహించే మోహనమంత్ర కార్యక్రమం ఈసారి కూడా భారీస్థాయిలో జరగనుంది. ఈ ఈవెంట్ ఈ నెల 27,28 మరియు 29లలో మూడు రోజులపాటు జరగనుంది. ఇందులో మొదటిరోజు Pro Night-Threeory band,రెండవరోజు DJ Night-Falcon Robert కార్యక్రమాలు జరగనున్నాయి. వీటితోపాటు ఇంకా అనేక రకాల కల్చరల్ అండ్ టెక్నికల్ ఈవెంట్స్ జరగనున్నాయి.

మోహనమంత్ర అనేది జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్ట్, యువ సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక కోలాహలం మరియు అనేక ఉల్లాసభరితమైన కార్యక్రమాల ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ప్రారంభమైంది. గత ఐదు సంవత్సరాల నుండి శ్రీ విద్యాకేతన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

దేశంలోని యువతకు ఉత్తమమైన విద్య, సౌకర్యాలు కల్పించాలనే గొప్ప ఆలోచనతో శ్రీ విద్యాకేతేన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రాంభించబడింది. లెజెండరీ యాక్టర్ డాక్టర్ ఎం. మోహన్ బాబు గారి నాయకత్వంలో స్థాపించబడి, నిర్వహించబడుతున్న ఈ ట్రస్ట్ తన ప్రయాణంలో అనేక విజయాలు సాధించి, విద్యావ్యవస్థలో అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటిగా మారింది. సంవత్సరాలుగా, ట్రస్ట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది, హైదరాబాద్, తిరుపతి మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యాసంస్థలను స్థాపించింది





Untitled Document
Advertisements