నలుగురికి మరణ శిక్షను రద్దు చేసిన హైకోర్టు!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 11:46 AM

నలుగురికి మరణ శిక్షను రద్దు చేసిన హైకోర్టు!!

గుంటూరు జిల్లా తంగెడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. కాలిబాట విషయంలో తలెత్తిన వివాదంలో సైదాను చంపేశారంటూ ఈ కేసులో పోలీసులు సుభాని, మరో ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశారు. గురజాల పదవ అడిషనల్ జిల్లా కోర్టు ఆ నలుగురికి మరణశిక్షను విధించింది.

అయితే, గురజాల న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును కొట్టివేసింది. పైగా, నిందితులు కారాగార శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకపోతే వారిని వెంటనే విడుదల చేయాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.





Untitled Document
Advertisements