అలాంటి సినిమాలు మాత్రమే చేస్తా: బెల్లంకొండ

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 02:30 PM

అలాంటి సినిమాలు మాత్రమే చేస్తా: బెల్లంకొండ

ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయినా సరైన హిట్ పడకపోవడంతో, రూట్ మార్చుకుని 'రాక్షసుడు' వంటి విభిన్నమైన సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో ఆయన తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్టుగా సమాచారం.

ఇకపై కాన్సెప్ట్ బేస్డ్ కథలను .. కొత్తదనంతో కూడిన దమ్మున్న కథలను మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు, స్టార్ డైరెక్టర్లతోపాటు టాలెంట్ వున్న కొత్త దర్శకులతోను చేయాలనుకుంటున్నాడట. ఈ కారణంగానే కొత్త దర్శకుల నుంచి కథలను వినడానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడని అంటున్నారు. ఇకపై బెల్లకొండ నుంచి రెగ్యులర్ సినిమాలు కాకుండా వైవిధ్యభరితమైన సినిమాలను చూస్తామన్న మాట.





Untitled Document
Advertisements