బ్రేకింగ్ కాదు.... హార్ట్ బ్రేకింగ్ ఇది!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 02:49 PM

బ్రేకింగ్ కాదు.... హార్ట్ బ్రేకింగ్ ఇది!!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో వీరాభిమానులు, అనుచరులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన మరణవార్త తెలుసుకున్న ఓ వీరాభిమాని గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు మద్దినేని వేంకటేశ్వర్లు అనే వ్యక్తి గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. కాగా.. మద్దినేనిది గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంతం అని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements