ఏమాత్రం తగ్గని విజయ్ దేవరకొండ!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:28 PM

ఏమాత్రం తగ్గని విజయ్ దేవరకొండ!!

విజయ్ దేవరకొండ... ఈ పేరు కి యువతలో మంచి క్రేజ్ వుంది. తన సినిమాలతోనే కాకుండా రియలిస్టిక్ యాటిట్యూడ్‌తో యూత్ కు తెగ కనెక్ట్ అయిపోయాడు. అయితే నటనలో అతనికి ఉన్న టాలెంట్ అన్ని వర్గాలకు అతడిని దగ్గర చేసింది.అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు విజయ్. అయితే విజయ్‌కి స్టార్ రేంజ్ ఇచ్చింది మాత్రం 'అర్జున్ రెడ్డి సినిమానే' అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా హిట్ వల్లే 'గీత గోవిందం' కూడా భారీ స్థాయిలో రికార్డు కొట్టేసింది. కానీ 'డియర్ కామ్రేడ్' ప్లాప్ అనేది విజయ్ మార్కెట్‌ని బాగా దెబ్బ తీసిందనే చెప్పుకోవాలి. అందుకే తన తర్వాత రాబోయే సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు విజయ్.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈ మూవీ టైటిల్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఇసబెల్లా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్ర బృందం.ఈ చిత్రం లో కూడా విజయ్ లిప్‌లాక్ లతో అలరిస్తాడాన్ని సమాచారం.

Untitled Document
Advertisements