మహానందిలో రోడ్లు జలమయం!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:48 PM

మహానందిలో రోడ్లు జలమయం!!

మొన్నటి నుంచి కర్నూలు జిల్లా మహానందిలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, మహానందిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లోకి వరద నీటితో పాటు మొసళ్లు, పాములు వచ్చి చేరుతున్నాయి. స్థానిక సలీమ్ నగర్ వీధుల్లో సుమారు మోకాలి లోతు వరకు నిలిచిన నీటిలో మొసలి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అయితే, నీటిలో తిరుగుతున్న మొసలిని చేప ఏమో అనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వరద నీటిలో మొసలి కొట్టుకువచ్చిన విషయాన్ని అటవీ శాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా స్థానికులు తెలియజేశారు. ఈ సమాచారం మేరకు సలీమ్ నగర్ కు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, మొసలిని బంధించారు. మొసలిని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని సిబ్బంది తెలిపారు.

Untitled Document
Advertisements