తమిళ హీరోని ఎందుకు తీసుకున్నంటే!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:59 PM

తమిళ హీరోని ఎందుకు తీసుకున్నంటే!!

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'వాల్మీకి' చిత్రం, ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు తమిళ నటుడు అధర్వ నటించాడు. ఆయనని తీసుకోవడానికి కారణమేమిటని చాలామంది అడుగుతున్నారు.

ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో అధర్వ కనిపిస్తాడు. ఈ పాత్రను తెలుగులో ఏ హీరోతో చేయించినా, అంతకుముందు వాళ్లు చేసిన పాత్రలు ఆడియన్స్ కి గుర్తుకువచ్చే అవకాశం వుంది. అందువలన తెలుగులో ఇంతవరకూ చేయని అధర్వని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాను. అధర్వ కూడా ఆ పాత్రను చాలా బాగా చేశాడు. తెలుగు భాష నేర్చుకుని డైలాగ్స్ బాగా చెప్పాడు. ఆయన నటనకు మంచి మార్కులు పడతాయి. నాకు తెలిసి ఈ సినిమా తరువాత తెలుగులోనూ అధర్వ బిజీ అవుతాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

Untitled Document
Advertisements