కారు కొనుగోలుదారులకు శుభవార్త : భారీ ఆఫర్లు వచ్చేశాయి..

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:10 PM

కారు కొనుగోలుదారులకు శుభవార్త : భారీ ఆఫర్లు వచ్చేశాయి..

దేశం లో ఆర్థిక మాంద్యం ప్రభావం వాహనాల విక్రయాలపై పడింది.. కార్లు, బైక్‌లు తేడాలేకుండా అన్ని తిరోగమనంలో ఉన్నాయి... తమ ఉత్పత్తులకు సరైన డిమాండ్ లేకపోవడంతో ప్రముఖ సంస్థలు సైతం తమ ఉత్పత్తులను ఆపివేయడం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఈ తరుణంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడంపై దృష్టి పెట్టాయి. ప్రముఖ కంపెనీ మహింద్రా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. అన్ని డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

మహీంద్రా టీయూవీ 300, మహీంద్రా కేయూవీ 100, మహీంద్రా టీయూవీ 300 ప్లస్‌, మహీంద్రా బొలేరో పవర్‌ ప్లస్‌, మహీంద్రా మరాజో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, మహీంద్రా థార్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్స్‌పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.దాదాపు రూ. 52,000 నుంచి రూ. 76,500 వరకు రాయితీ లభించనుంది. క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్చేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌, ఉచిత యాక్సెసరీస్‌, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ రూపాల్లో ఈ డిస్కౌంట్లను పొందే వీలుంటుంది.

Untitled Document
Advertisements