జుడీషియల్ కస్టడీ రేపు ముగియనుండగా చిదంబరం మీటింగ్

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:17 PM

జుడీషియల్ కస్టడీ రేపు ముగియనుండగా చిదంబరం మీటింగ్

కాంగ్రెస్ లీడర్లు గులాం నబీ ఆజాద్,అహ్మద్ పటేల్ ఈ రోజు తీహార్ జైల్ లో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారని సమాచారం. చిదంబరం తనయుడు కార్తీ కూడా వారితో ఉన్నారు.వారు అరగంట మీటింగ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు,కశ్మీర్ అంశం,ఆర్ధిక మాంద్యం,రాబోయే ఎలక్షన్లు వంటి కీలక అంశాలు చర్చించుకున్నట్టు సమాచారం.ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం సెప్టెంబర్ 5 న తీహార్ జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఆయన జుడీషియల్ కస్టడీ రేపటి (సెప్టెంబర్ 19) తో ముగియనుంది.సెప్టెంబర్ 16 న 74 వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన ఆరోగ్యాంగానే ఉన్నట్టు సమాచారం.

Untitled Document
Advertisements