గాయాలతో అల్లుఅర్జున్ ... ఆందోళనలో ఫాన్స్..!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:34 PM

గాయాలతో అల్లుఅర్జున్ ... ఆందోళనలో ఫాన్స్..!!

మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ నాపేరు సూర్య తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో .. చాల రోజుల గ్యాప్ తర్వాత రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వీరి కలయికలో రెండు సూపర్ హిట్ సినిమాలు రాగ ఈ చిత్రం తో హ్యాట్రిక్ పై కన్నేశారు..ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ మూవీ పై మంచి అంచనాలే పెంచుకున్నారు.ఇక అసలు విషయానికి వస్తే బన్నీ తలకు గాయాలతో ఉన్న ఒక ఫోటో ఇంస్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన బన్నీ అభిమానులు బన్నీ కి ఏదో జరిగిపోయిందంటూ సీన్ క్రియేట్ చేసారు.ఈ పిక్చర్ వార్తల్లో నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి అవి నిజం దెబ్బలు కావు షూటింగ్ లో ఒక సన్నివేశానికి బన్నీకి అలా మేకప్ వేయడం జరిగింది అంతే. ఇందులో ఫాన్స్ బయపడాల్సిన పనేమీ లేదు.

Untitled Document
Advertisements