నిర్మాతగా సెకండ్ సినిమా

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:48 PM

నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా కెరియర్ కొనసాగించాలని చూస్తున్నాడు. అ! తో నిర్మాతగా తన అభిరుచిని తెలిసేలా చేసిన నాని నిర్మాతగా తన సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడట. ఈ ఇయర్ జెర్సీ, గ్యాంగ్ లీడర్ రెండు సినిమాలతో హిట్ అందుకున్న నాని నిర్మాతగా మరో సినిమా చేస్తున్నాడట. ఆ సినిమాలో హీరోగా ఫలక్ నుమా దాస్ లీడ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఈనగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాలతో తన టాలెంట్ చూపించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో బాలీవుడ్ రీమేక్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాని నిర్మాణంలో రాబోయే సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నాని ప్రొడక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ కూడా అ! లానే ప్రయోగాత్మకంగా ఉంటుందా లేక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందా అన్నది చూడాలి. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది కూడా వెళ్లడించలేదు.

Untitled Document
Advertisements