చంద్రబాబు తీరు పట్ల కోడెల శివ ప్రసాద్ చాల భాధ పడ్డారు .. బీజేపీ

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 05:15 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా కోడెల మృతి పట్ల చర్చలు జరుగుతున్నాయి. కోడెల ఆత్మహత్యకి ప్రభుత్వం కారణమని కొందరు, చంద్రబాబు తీరు అని మరి కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనం గా మారాయి.కోడెల ఆత్మహత్య విషయం లో రఘురాం పలు కీలక వ్యాఖ్యలు ప్రజలకు తెలియ చేసారు. బీజేపీ లో పార్టీ మారె ఆలోచన ఉందని, అమిత్ షా ని కలిసి మాట్లాడతానని కోడెల తనతో అన్నట్లు తెలిపారు. అందుకు తానూ కూడా సరేనని తెలిపారు. ఈ ఆత్మహత్య ని రాజకీయానికి వాడుకోవద్దు అంటూ అన్నారు. కోడెల పార్థివ దేహం ఉండగానే కోడెల మృతిని పలు పార్టీలు రాజకీయంగా వాడేసుకుంటున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తీరు పట్ల కోడెల శివ ప్రసాద్ చాల భాధ పడినట్లు రఘురాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే, ఈ విషయం లో పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు, ఏ ఒక్కరూ తనకి అండగా లేరు అంటూ వాపోయారని అన్నారు. ఎన్నో కష్టాల్ని భాదల్ని ఎదుర్కొన్న కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ లాంటి కేసుని ఎదుర్కోవడం కష్టమేమి కాదు, కానీ తన కుటుంబ సభ్యుల మీద పలు ఆరోపణలు చేయడం, ఏ ఒక్కరు తమకి అండగా లేరు అని, నిజాయితీగా పని చేసినందుకు ఇలా అయిందని అన్నారు.

కోడెల ఆత్మహత్య పై దర్యాప్తు జరపాలి అంటూ ఇప్పటికే పలు నేతలు వ్యాఖ్యానించారు. కోడెల సెల్ ఫోన్ కనిపించకపోవడం పట్ల పలు చర్చలకు దారి తీసింది. కోడెల మృతి పట్ల వాస్తవాలని వెలికి తీసేందుకు దర్యాప్తు జరిపించాలని రఘురాం పేర్కొన్నారు.

Untitled Document
Advertisements