యుకో బ్యాంకు లో మేజర్ ఫైర్ ఆక్సిడెంట్

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 06:43 PM

యుకో బ్యాంకు లో మేజర్ ఫైర్ ఆక్సిడెంట్

Bangalore : బెంగుళూరు లోని UCO బ్యాంకు లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఎగిసి పడుతున్న మంటలను నియంత్రించడం తో ప్రాణ నష్టం ఏమి చోటుయి చేసుకోలేదని సమాచారం. ప్రత్యక్షంగా చూసిన వారి ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యూకో బ్యాంకు ఆఫీసునుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఇదే భవనంలో పలు కోచింగ్‌ సెంటర్లు ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంతో తీవ్ర భయాందోళనలో పక్క భవనం నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు.బార్టన్ సెంటర్ పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్తులోని కేబుల్ గదిలో మంటలు చెలరేగాయి. ఇవి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు భవనంపైనుంచి దూకడానికి ప్రయత్నిచారు. అయితే భవనం మెయింటెనెన్స్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. భయపడొద్దని, ఆందోళన చెందుతున్నవారికి చెప్పాం, ఫైర్‌ సిలిండర్ల సాయంతో మంటలను ఆర్పివేసి, ప్రజలను రక్షించామని సిబ్బంది అలీ తెలిపారు. తరువాత ఫైర్‌ ఇంజిన్లు వచ్చి పరిస్థితిని మరింత చక్కదిద్దాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.





Untitled Document
Advertisements