11.52 లక్షలమంది ఉద్యోగులకు 78 రోజులు జీతానికి సమానమైన బోనస్

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 07:05 PM

అవును. రైల్వేశాఖలో పనిచేస్తున్న 11.52 లక్షలమంది ఉద్యోగులకు 78 రోజులు జీతానికి సమానమైన బోనస్ ఇవ్వబోతోంది. ఈ విషయం కేంద్రమంత్రి ప్రకాష్ జవాడేకర్ బుదవారం ప్రకటించారు. దీనికోసం కేంద్రప్రభుత్వం రూ.2,024 కోట్లు కేటాయించిందని తెలిపారు. రైల్వేలో పనికేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల సమిష్టికృషి కారణంగానే రైల్వే శాఖ విజయవంతంగా నడుస్తోందని, కనుక వారి కష్టానికి, నిబద్దతకు తగిన ప్రతిఫలం ఇవ్వడం న్యాయమని ప్రకాష్ జవాడేకర్ అన్నారు.

దేశంలో ప్రభుత్వరంగ సంస్థలలో అతిపెద్దదైన రైల్వేశాఖ ఏటా లక్షలాదిమంది ఉద్యోగులకు బోనసులు ఇవ్వగలుగుతుంటే, కొన్ని వేలమందితో నడిచే ప్రభుత్వ రోడ్డు రవాణాసంస్థలు, విమానయాన సంస్థలు నష్టాలబాటలో సాగుతూ ప్రభుత్వం అందించే ఆర్ధికసాయంతో పడుతూలేస్తూ ముందుకు సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాటితో పోలిస్తే రైల్వేశాఖ నిర్వహణే చాలా క్లిష్టమైంది. అయినా రైల్వేశాఖ విజయవంతంగా నడుస్తుంటే అవి మాత్రం ఎప్పుడూ నష్టాలలో ఎందుకు మునిగితేలుతున్నాయి?ఆలోచిస్తే బాగుంటుంది.

Untitled Document
Advertisements