వరుసగా ఐదోసారి రెపో రేటులో కోత

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 07:15 AM

వరుసగా ఐదోసారి రెపో రేటులో కోత

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లలో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 5.15 శాతానికి దిగిరానుంది. ఈ కోతతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత చౌక కానున్నాయి. శుక్రవారం ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన దేశీయ ఆర్థిక వృద్ధి రేటును పునరుద్ధరించేందుకు దశాబ్దం కాలం దిగువకు వడ్డీ రేట్లను తగ్గించినట్టు తెలిపారు. ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ)లోని ఆరుగురు సభ్యులు కూడా రెపో రేటు తగ్గింపు, సర్దుబాటు విధానానికి ఓటు వేశారు. దీంతో 2010 మార్చిలో ఉన్న 5 శాతం రెపో రేటు స్థాయి కి ప్రస్తుత రేటు పడిపోయింది. ఇదే విధంగా రివర్స్ రెపో రేటును కూడా 4.9 శాతానికి తగ్గించారు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలకు ఆర్‌బిఐ తీసుకునే రేటు. అలాగే రివర్స్ రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే నిధులకు ఆర్‌బిఐ ఇచ్చే రేటు.అవకతవకల కారణంగా పిఎంసి బ్యాంక్‌పై ఆంక్షలు విధించినందు వల్ల ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, అన్ని సహకార బ్యాంకులకు ప్రస్తుత సంఘటనతో చూడరాదని అన్నారు. ఈ బ్యాంకుల నియంత్రణ మళ్లీ సమీక్షిస్తామని, ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాస్ అన్నారు.ఆర్‌బిఐ వరుసగా ఐదోసారి రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో 0.35 శాతం ఊహించని విధంగా కోత పడింది. అంతకుముందు రేటు మూడుసార్లు -0.25 శాతం తగ్గించారు. అక్టోబర్ రేటుతో కలిపి రెపో రేటు ఈ సంవత్సరం మొత్తంగా 1.35 శాతం తగ్గింది. శుక్రవారం కోత తరువాత, దాని రేటు 5.40 శాతం నుండి 5.15 శాతానికి పడిపోయింది. మార్చి 2010 తరువాత ఇది అత్యల్పం.ఆర్‌బిఐ ద్రవ్య విధానం గురించి సర్దుబాటు దృక్పథాన్ని కొనసాగించింది. అంటే వడ్డీ రేటును మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతం. జిడిపి వృద్ధిని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నంతవరకు ఈ విధానాన్ని కొనసాగిస్తామని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ తదుపరి సమావేశం డిసెంబర్ 3- నుంచి 5 తేదీలలో జరుగుతుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఆర్థిక వృద్ధి అంచనాను ఆర్‌బిఐ 6.1 శాతానికి తగ్గించింది. గతంలో వృద్ధి అంచనా 6.9 శాతం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణ రేటును 3.1 శాతం నుండి 3.4 శాతానికి పెంచారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో (అక్టోబర్-మార్చి) రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 3.5% నుంచి 3.7% మధ్య ఉంటుందని అంచనా.అక్టోబర్ 1 నుండి వడ్డీ రేట్లను రెపో రేట్లతో అనుసంధానించాలని ఆర్‌బిఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఎస్‌బిఐ సహా పలు ప్రధాన బ్యాంకులు కూడా రెపో రేటును ఎంచుకున్నాయి. దీని ప్రయోజనం ఏమిటంటే ఆర్‌బిఐ రెపో రేటును తగ్గించినప్పుడల్లా రుణాలు వినియోగదారులకు వెంటనే చౌకగా లభిస్తాయి. ఎంసిఎల్‌ఆర్ ఆధారిత రుణాలలో వినియోగదారులకు తక్షణ ప్రయోజనాలు అందలేదు. బదులుగా రీసెట్ తేదీ ప్రకారం ఇఎంఐ మారుతుంది. రెపో రేటు తగ్గిన వెంటనే వడ్డీ రేట్లను తగ్గించడానికి బ్యాంకులు కూడా బాధ్యత వహించలేదు. దీంతో ఆర్‌బిఐ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వినియోగదారులకు ఆర్‌బిఐ రేటు తగ్గింపు పూర్తి ప్రయోజనం అందడం లేదు.రెపో రేటు తగ్గింపును సద్వినియోగం చేసుకోవడానికి ఎస్‌బిఐ పాత కస్టమర్లు లోన్ షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన బ్యాంకుల పరిస్థితి స్పష్టంగా లేదు. రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానించిన బ్యాంకులు తమ కొత్త కస్టమర్లకు వెంటనే 0.25 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తాయి.రెపో రేట్లతో అనుసంధానించబడిన అన్ని రకాల రుణాలు ఇప్పుడు చౌకగా మారతాయి. రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బిఐ నుండి రుణం పొందే రేటు. బ్యాంకులు తక్కువ రేటు రుణాలు పొందడం వల్ల వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుంది. అయితే రెపో రేటుతో అనుసంధానించిన ఎఫ్‌డి వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) లోని మొత్తం 6 మంది సభ్యులు రేటును తగ్గించడానికి అనుకూలంగా ఓటు వేశారు. 5 మంది సభ్యులు 0.25 శాతం తగ్గింపునకు మద్దతు ఇచ్చారు. ఎంపిసి సభ్యుడు రవీంద్ర ధోలకియా 0.40 శాతం తగ్గింపు కోరారు.వడ్డీ రేటు తగ్గింపుతో పాటు ఆర్‌బిఐ సామాన్య ప్రజల కు రెండో బహుమతి ఇచ్చింది. ఇక నుంచి నెఫ్ట్ సేవ లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఆర్‌బిఐ సమావేశంలో 24 గంటల నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానికి ఫండ్ ట్రాన్స్‌ఫర్) నిధుల బదిలీని ప్రకటించింది. ప్రస్తుతం ఈ సౌకర్యం పని రోజులలో రాత్రి 7.45 వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ సౌకర్యం 24గంటలు అందుబాటులో ఉంటుంది.ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేట్లలో పావు శాతం కోత విధించింది. ఆర్‌బిఐ నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.రేపో రేటు లేదా స్వల్పకాలిక రుణ రేటు 25 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో రేపొరేటు 5.15 శాతానికి దిగిరానుంది. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం లభించనుంది. గృహ రుణం, వ్యక్తిగత, కారు రుణం చౌకగా మారనుంది, ఇఎంఐ భారం కూడా తగ్గుతుంది.
2019 సంవత్సరంలో ఇది ఐదోసారి కోత.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(201920) జిడిపి వృద్ధి రేటు అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది.
రివర్స్ రెపో రేటు కూడా 4.90 శాతానికి తగ్గింది.
వృద్ధి వేగాన్ని పెంచే దృష్ట్యా ద్రవ్య విధానం లో సర్దుబాటు చేసే విధానం కొనసాగుతుంది.
ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టే ప్రోత్సాహక చర్యలు ప్రైవేటు రంగంలో వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి దోహదం చేస్తాయి.
ఆర్థిక మందగమనం కొనసాగుతుండడం వల్ల ఆర్థిక వృద్ధిని పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి
రెండవ త్రైమాసికంలో సవరించిన రిటైల్ ద్రవ్యోల్బణ అంచనా 3.4 శాతానికి. ఈ ఏడాది రెండో భాగానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనా 3.5 నుండి 3.7 శాతంగా ఉంది.
పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ముందుకు తెచ్చే పని సగం పూర్తయిందని రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది.
అక్టోబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 434.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది 2019 మార్చి 31 నాటికి 21.7 బిలియన్ డాలర్ల పెరుగుదల.
ద్రవ్య విధాన కమిటీ సభ్యులందరూ రేట్లు తగ్గించడానికి అంగీకరించారు.
తదుపరి ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం 2019 డిసెంబర్ 3వ తేదీ నుంచి ఉంటుంది.





Untitled Document
Advertisements