NHAIలో పోస్టులు...నోటిఫికేషన్ విడుదల

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 08:09 AM

NHAIలో పోస్టులు...నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
* డిప్యూటీ మేనేజర్: 30 పోస్టులు:
పోస్టుల కేటాయింపు: జనరల్-03, ఎస్సీ-04, ఎస్టీ-02, ఓబీసీ-08, ఈడబ్ల్యూఎస్-13.
ఉద్యోగ స్వభావం: హెచ్ఆర్/ అడ్మిన్.
అర్హత: సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: గేట్-2019 అర్హత, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
జీతం: రూ.15,600-39,100 (జీపీ రూ.5,400).
దరఖాస్తుకు చివరితేదీ: 31.10.2019.

Untitled Document
Advertisements