భారత అథ్లెట్ కు నిరాశ

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 08:11 AM

భారత అథ్లెట్ కు నిరాశ

భారత అథ్లెట్ జిన్సన్‌ జాన్సన్‌ 1500మీ. పరుగులో నిరాశపరిచి ఫైనల్‌ రౌండ్‌కు అర్హత పొందలేకపోయాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన 1500మీ. పరుగును జిన్సన్‌ 3 నిమిషాల 39:86 సెకన్లలో మాత్రమే గమ్యానికి చేరగలిగాడు. దీంతో 43మంది పాల్గొన్న ఈ పోటీలో జిన్సన్‌ 34వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 1500మీటర్ల పరుగులో భాగంగా తొలిరౌండ్‌ పోటీలో మాత్రం 10వ స్థానంలో నిలవగలిగాడు. జాకొబ్‌(నార్వే) 3 నిమిషాల 37:67 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇక షాట్‌పుట్‌లో భారత్‌కు చెందిన తేజిందర్‌ నిరాశపరిచాడు. 12మంది పాల్గొన్న ఈ ఫైనల్‌ అర్హత పోటీలో తేజిందర్‌ గుండును 19.55మీ. దూరాన్ని మాత్రమే విసరగలిగాడు. ఫైనల్‌కు చేరాలంటే కనీస అర్హత 20.90మీటర్లు. ఈ విభాగంలో క్రొయేషియాకు చెందిన ఫిలిప్‌(21 మీ.) ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Untitled Document
Advertisements