మరో మ్యాచ్‌ డ్రా

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 08:15 AM

మరో మ్యాచ్‌  డ్రా

భారత మహిళల హాకీ జట్టు మరో మ్యాచ్‌ను డ్రా చేసింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య బ్రిటన్‌తో జరిగిన చివరి, ఐదో మ్యాచ్‌ను భారత అమ్మాయిలు 2-2 గోల్స్‌తో డ్రా చేసుకున్నారు. భారతజట్టు తరఫున నవ్‌జీత్‌ కౌర్‌, గుర్జీత్‌కౌర్‌లు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచగా... బ్రిటన్‌ తరఫున ఎలిజెబెత్‌(55వ ని.), అన్న థోమర్‌(60వ ని.)లో గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. దీంతో ఈ పర్యటనలో 9వ ర్యాంకర్‌ భారత మహిళల జట్టు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ టూర్‌లో భాగంగా ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడి ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అంతేగాక మరో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. దీంతో బ్రిటన్‌ టూర్‌ టెస్ట్‌ సిరీస్‌ భారత అమ్మాయిల జట్టు 1-1తో డ్రా చేసుకున్నట్లయ్యింది.

Untitled Document
Advertisements