విజయ్ న్యూ లుక్...పూరి కోసమేనా?

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 09:07 AM

విజయ్ న్యూ లుక్...పూరి కోసమేనా?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసాడు. అదే రౌడీ బ్రాండ్. తన ఫ్యాన్స్‌ని రౌడీ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ తన బ్రాండ్‌కి కూడా అదే పేరు పెట్టుకున్నాడు. ఆ బ్రాండ్‌లో చాలా గూడ్స్ ఉన్న బట్టలు మాత్రం బాగా ట్రెండీగా ఉంటాయి. అందుకే వాటిని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ సినిమాలతో బిజీ అయిపోయి ఆ బ్రాండ్‌కి సంబదించిన ప్రమోషన్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా రౌడీ బ్రాండ్‌లో ఎప్పుడూ కూడా కేవలం చెక్స్ ‌షర్ట్స్ మాత్రమే ఉంటున్నాయి అనే కామెంట్ కూడా ఉందిఅందుకే దొరికిన చిన్న గ్యాప్‌లో తన రౌడీ బ్రాండ్‌ని ప్రొమోట్ చేసుకునే పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ బ్రాండ్‌లో కొత్తగా వచ్చిన కలెక్షన్స్‌తో ఒక ఫోటో షూట్ చేసారు. అయితే ఈ ఫోటో షూట్‌లో తాను వేసుకున్న రౌడీ బ్రాండ్ వేర్ కంటే కూడా తన లుక్స్ చాలా స్టైలిష్‌గా, డామినేటింగ్‌గా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా లైట్ గడ్డంతో, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం గుబురు గడ్డంతో, రగ్గడ్ లుక్‌లో ఉన్న విజయ్ ఇప్పుడు మాత్రం సూపర్ క్యూట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. అతని హెయిర్ స్టైల్ కూడా చాలా బావుంది. పేరుకి రౌడీ అండ్ రెబెల్ అయినా కూడా లుక్స్ పరంగా మాత్రం పర్ఫెక్ట్ లవర్ బోయ్‌లా ఉన్నాడు. అయితే అతను వేసుకున్న రౌడీ బ్రాండ్ వేర్ కూడా చాలా ట్రెండీగా ఉంది. షూస్ కూడా చాలా క్యాజువల్‌గా బావున్నాయి.ఈ ఫోటో షూట్ వల్ల రౌడీ బ్రాండ్‌లోని ఈ కొత్త కలెక్షన్స్‌కి మాత్రం మంచి డిమాండ్ ఏర్పడుతుంది అనే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే విజయ్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ కొత్త లుక్ పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో నటించబోతున్న ఫైటర్ సినిమా కోసం అని ప్రచారం జరుగుతుంది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉంది.ఆ సినిమాలో విజయ్ చాల రకాల గెటప్స్‌లో కనిపిస్తాడు. దానికోసం ఈ లుక్. షెడ్యూల్‌లో చిన్న గ్యాప్ వచ్చింది. అది పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి డిసెంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే పూరి జగన్నాధ్ సినిమా ఫైటర్ కోసం విజయ్ దేవరకొండ స్పెషల్‌గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటాడు. అది పూర్తయిన తరువాత ఫైటర్ సినిమాకోసం లుక్ మర్చుంటాడు.సో, ప్రస్తుతానికి అయితే ఈ సాఫ్ట్ లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు ఈ రౌడీ.





Untitled Document
Advertisements