రోజా జీతభత్యాలపై ఉత్తర్వులు...నెలకు రూ.3.82 లక్షలు

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 10:08 AM

రోజా జీతభత్యాలపై ఉత్తర్వులు...నెలకు రూ.3.82 లక్షలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి ఇస్తున్నట్టు చెప్పినా జులై 10 వరకు ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఆమె జులై 15 వరకూ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టలేదు. కొన్ని కారణాలతో.. ఉత్తర్వులు జారీలో జాప్యం జరిగిందని, అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉత్తర్వులు జారీచేసినా, ఆమె జీతభత్యాలపై అందులో పేర్కోలేదు.తాజాగా, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం జారీచేసింది. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఎమ్మెల్యే రోజాకు జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతనం కింద రూ.2 లక్షలు, వాహన సౌకర్యానికి నెలకు రూ.60 వేలు, ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం లేని పక్షంలో వసతి సౌకర్యానికి నెలకు ఇంటి అద్దె రూ.50 వేలు, మొబైల్‌ సేవలకు రూ.2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు నెలకు రూ.70 వేలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

Untitled Document
Advertisements