నల్లజాతీయుడిపై వివక్ష...పోలీసులపై చర్యలు

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 10:56 AM

నల్లజాతీయుడిపై వివక్ష...పోలీసులపై చర్యలు

అమెరికాలోని టెక్సాస్‌లో ఒక నల్లజాతీయుడిపై ఇద్దరు పోలీసులు అధికారం చలాయించారు. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించిన ఓ నల్లజాతీయుడిపై జులుం చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఈ నల్ల జాతీయుడు డొనాల్డ్‌ నీలిని తాడుతో చేతులు కట్టేసి నడిపిస్తూ పోలీసులు మాత్రం గుర్రంపై సవారీ చేస్తూ అతడిని అదిలిస్తున్న దృశ్యాలతో విడుదలైన వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అధికారులు నడుముకు కట్టుకున్న కెమెరాలలో నిక్షిప్తమైన ఈ వీడియో, కొన్ని ఫొటోలను, ఈ ఘటనపై దర్యాప్తు చేసిన కౌంటీ షరీఫ్‌ సమర్పించిన నివేదికను ఇటీవల పరిశీలించిన గాల్వెస్టన్‌ పోలీస్‌ ఛీఫ్‌ వెర్నన్‌ హాలే వారిని విధుల నుండి తప్పించినట్లు పోలీసు ప్రతినిధి మరిస్సా బెర్నెట్‌ మీడియాకు చెప్పారు. అయితే ఈ ఇద్దరు అధికారులపై క్రిమినల్‌ దర్యాప్తు అవాంఛనీయమని టెక్సాస్‌కు చెందిన ప్రజా భద్రతా విభాగం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే వీరిపై క్రమశిక్షణా చర్య కానీ, మరే ఇతర చర్య అయినా తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై హాలే త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని బార్నెట్‌ వివరించారు.





Untitled Document
Advertisements