నవరాత్రి వేడుకలు...మోడీ మాస్క్ లతో గర్భా నృత్యం

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 11:02 AM

నవరాత్రి వేడుకలు...మోడీ మాస్క్ లతో గర్భా నృత్యం

సూరత్‌లో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు ప్రధాని మోడీ మాస్క్ లను ధరించి నృత్యం చేసి మైమరిపించారు. ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సరికొత్త పద్ధతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది యువతులు.. తమ శరీరంపై సామాజిక బాధ్యతగా ఆలోచించే టాటూలను వేయించుకున్నారు. ఓ యువతి తన వీపుపై చంద్రయాన్-2ను టాటూను, మరో యువతి ఆర్టికల్ 370, 35ఏ టాటూను, ఇంకో అమ్మాయి ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కావాలని చూపించే టాటూలను,ఇలా వివిధ రకాల టాటూలు వేయించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.





Untitled Document
Advertisements