అద్భుత చిత్రాలను పంపిస్తున్న ఆర్బిటర్

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 11:06 AM

అద్భుత చిత్రాలను పంపిస్తున్న ఆర్బిటర్

చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ వింతవింత ఫోటోలు పంపిస్తోంది. ఆర్బిటర్‌లో అమర్చిన ఎంతో కీలకమైన హై రిజల్యూషన్‌ కెమెరా ఈ ఫొటోలు తీసింది. చంద్రుడి నైసర్గిక స్వరూపం తెలుసుకునేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. సెప్టెంబరు 5న చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలను తీసింది ఆర్బిటర్‌. దక్షిణ ధ్రువంలో 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతుతో ఉన్న 'బోగుస్లాస్కై ఈ' బిలాన్ని గుర్తించింది ఇస్రో. ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున బండరాళ్లను ఇస్రో గుర్తించింది. కాగా, చంద్రయాన్‌ 2 ప్రయోగంలో కీలకమైన విక్రమ్ ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోగా.. ల్యాండర్‌ను గుర్తించినా.. దానితో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నాసా కూడా విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements