తొలిటెస్ట్....కుప్పకూలిన సఫారీలు

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 11:07 AM

తొలిటెస్ట్....కుప్పకూలిన సఫారీలు

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 431 పరుగులకి ఆలౌట్ చేసింది. ఆటలో నాలుగో రోజైన శనివారం 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు తొలి సెషన్‌లోనే 431 వద్ద కుప్పకూలిపోయారు. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి ఉన్న భారత్ జట్టుకి 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో డీన్ ఎల్గర్ (160: 287 బంతుల్లో 18x4, 4x6), డికాక్ (111: 163 బంతుల్లో 16x4, 2x6) శతకాలు సాధించగా.. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఏడు, జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు. ఈరోజు ఆరంభ సెషన్‌లోనే కేశవ మహరాజ్ (9: 31 బంతుల్లో 1x4) వికెట్ పడగొట్టిన అశ్విన్.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ.. నిన్న ఆఖరి సెషన్‌లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ముత్తుసామి (33 నాటౌట్: 106 బంతుల్లో 4x4) ఈరోజు కూడా పట్టుదలతో క్రీజులో నిలిచాడు. ఆఖర్లో కగిసో రబాడ (9: 31 బంతుల్లో 1x4) అతనికి చక్కటి సహకారం అందించాడు. బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత మయాంక్ అగర్వాల్ (215: 371 బంతుల్లో 23x4, 6x6), రోహిత్ శర్మ (176: 244 బంతుల్లో 23x4, 6x6) శతకాలు బాదడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో భారీ స్కోరు సాధించగలిగింది. అయితే.. దక్షిణాఫ్రికా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.





Untitled Document
Advertisements